తెలంగాణపై ప్రేమ లేని రైతు స్వరాజ్య వేదిక ఏసీ గదుల్లో కూర్చుని నివేదికలు తయారు చేస్తోందని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. దాని ఆధారంగా చేసుకొని కొందరు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతాంగం ఆత్మస్థైర్యం దెబ్బతినేలా తప్పుడు ప్రచారం చేస్తే ఉరికించి కొడతామని ఆయన హెచ్చరించారు. రైతు స్వరాజ్య సమితి, షర్మిళతో పాటు ఓ పత్రిక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో ఆత్మహత్యలు సుమారు 300 శాతం తగ్గాయని పేర్కొన్న ఆయన.. ఎన్‌సీఆర్‌బీ గణాంకాలను కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారన్నారు. దమ్ముంటే కేంద్ర విధానాలను ప్రశ్నించాలని ఆయన సూచించారు. పక్కన విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టినా స్పందించకుండా.. ఇక్కడ దుష్ప్రచారం చేస్తున్నారని పల్లా ధ్వజమెత్తారు. తెలంగాణలో వ్యవసాయ స్థితిగతులపై నీతి ఆయోగ్ కితాబునిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను చూసి కొందరు ఓర్వలేక పోతున్నారని ఆయన దుయ్యబట్టారు. కల్లాలు నిర్మించిన రూ.150 కోట్ల ఉపాధి హామీ నిధులను వెనక్కి ఇవ్వాలని కేంద్రం ఒత్తిడి చేయడం దుర్మార్గమని.. దానిపై రాష్ట్ర సీఎస్ కేంద్రంతో మాట్లాడుతున్నారన్నారు.
ఇవీ చదవండి: