MLC Kavitha Women's Bill 2023 : 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు.. 13ఏళ్లైనా మోదీ ప్రభుత్వంలో ఎందుకు ఆమోదం పొందలేదని బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ అంశంపై ఏనాడు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలు (Priyanka Gandhi) ప్రభుత్వాన్ని నిలదీయలేదని మండిపడ్డారు. మహిళల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. మహిళల హక్కుల కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని ఆమె ఆరోపించారు. అందుకే పార్లమెంటులో మహిళా ఎంపీలు 12శాతమే ఉన్నారని కవిత పేర్కొన్నారు.
MLC Kavitha Women's Reservation Bill 2023 : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో (BRS MLA Candidates) మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తోన్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. జంతర్ మంతర్ వద్ద మహిళల కోసం తాను చేసిన ధర్నాను హేళన చేస్తున్నారని.. తన పోరాటం మహిళల కోసం తప్పితే వ్యక్తిగతం కాదని స్పష్టం చేశారు. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను మరోసారి ఎమ్మెల్సీ కవిత ఖడించారు. ఆయన విషయంలో ఎలా ముందుకెళ్లాలనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎల్బీనగర్‌లో మహిళపై పోలీసుల లాఠీ ఛార్జ్ (Police Lathi charge woman in LB Nagar) ఘటనపై కవిత స్పందించారు. ఈ ఘటన పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చే అంశంగా ఆమె పేర్కొన్నారు. ఆ విషయం తెలియగానే బాధ్యులపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
Kavitha Fires on Revanth Reddy : బీఆర్‌ఎస్‌లో మహిళలకు సీట్లు కేటాయింపు అంశంపై కవిత స్పందించారు. ఇది పార్టీ, వ్యక్తి గత సమస్య కాదని అన్నారు. దీనిపై అన్ని పార్టీలు కలిసి పోరాడాలని సూచించారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలధీశారు. దీనిపై రేవంత్ రెడ్డి ఏనాడు మాట్లాడలేదని మండిపడ్డారు. అంతిమంగా మహిళలకు ప్రత్యేక చట్టం చేసి రిజర్వేషన్ కల్పిస్తేనే ప్రాతినిథ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం శీతాకాల సమావేశాల్లో మహిళ బిల్లు చట్టసభల్లో ప్రవేశ పెడతామని కవిత పేర్కొన్నారు.
"ఇప్పటికీ లోక్‌సభలో మహిళా ఎంపీలు 12 శాతమే. తొలి లోక్‌సభలో 4 శాతం ఉంటే ఇప్పుడు 12 శాతానికి పెరిగారు. 75 ఏళ్లల్లో మహిళా ఎంపీల సంఖ్య 8 శాతమే పెరిగింది. మణిపుర్‌లో ఇన్నాళ్లకు ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్రం తర్వాత మణిపుర్‌లో ఇన్నేళ్లు మహిళలు ఎమ్మెల్యేలు కూడా కాలేదు. మహిళలు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా? 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు 2023 వచ్చినా ఎందుకు ఆమోదం పొందలేదు. పదేళ్లుగా పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదు. ఎల్బీనగర్ ఘటన పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చే అంశం. విషయం తెలియగానే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాం."- కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
MLC Kavitha Sings Bathukamma Song : బతుకమ్మ సంబురాల కోసం సింగర్‌గా మారిన MLC కవిత.. ప్రోమో చూడండి