ETV Bharat / state

మహిళా రిజర్వేషన్​ బిల్లు.. పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత - Womens Reservation Bill latest news

MLC Kavitha who released the poster: మహిళా రిజర్వేషన్​పై ఇది వరకే దిల్లీలో ధర్నా చేసిన ఎమ్మెల్సీ కవిత తాజాగా ఓ పోస్టర్​ను విడుదల చేసింది. దీని ద్వారా దేశంలో ప్రముఖ విద్యావేత్తలు, ఆలోచనపరులు, మేధావులు ఈ అంశంలో పాల్గొనాలని ఈ పోస్టర్​ను రిలీజ్ చేశారు.

MLC Kavitha who released the poster
పోస్టర్​ను విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
author img

By

Published : Mar 24, 2023, 8:41 PM IST

MLC Kavitha who released the poster: మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యాంశం కాకూడదని భారత జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేసేందుకు.. వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టేలా కవిత ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నారు. మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించారు. మహిళా బిల్లుకు మద్దతివ్వాలని కోరుతూ దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కవిత పోస్టుకార్డులు వ్రాయనున్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా కవిత సామాజిక మాధ్యమాల్లో పోస్టర్​ను విడుదల చేశారు.

దిల్లీలో ఈ నెల 11న దీక్ష: మహిళా రిజర్వేషన్​ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్​తో కవిత ఈ నెల 11న దిల్లీలోని జంతర్​మంతర్​ దగ్గర దీక్ష చేశారు. భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. ఈ దీక్షను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. బీఆర్​ఎస్​ ఎంపీలతో సహా మంత్రులు పాల్గోన్నారు. ఈ దీక్షకు కొంత మంది ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్​ బిల్లు కవితకు మాత్రం సంబంధించినది కాదని, దేశంలో సగం మందికి అవసరమని అన్నారు. మోదీ మొదటిసారి ఎన్నికైన తర్వాత అతను ప్రధాన లక్ష్యాల్లో ఈ బిల్లు ఒకటి అని గుర్తు చేశారు. కొంత మంది బీఆర్​ఎస్​ నాయకులు ఈ అంశంపై మోదీ సర్కారుపై విమర్శలు చేశారు.

దీక్షలో మాట్లడిన మాటలు: మహిళా రిజర్వేషన్ పార్లమెంట్​లో బిల్లు ప్రవేశపెట్టే వరకు పోరాటం ఆపేది లేదని వెల్లడించారు. ఈ బిల్లుతో దేశం బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమే.. సభలో ప్రవేశపెట్టకపోతే దేశం అంతటా ఆందోళనలు తీవ్రం చేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే తాజాగా దేశంలో ఉన్న మేధావులు అంతా ఈ ఉద్యమానికి సహాయం చేయాలని పోస్టర్​ను విడుదల చేశారు. ఎమ్మెల్సీ కవిత దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాను ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఈడీ విచారణకు వెళ్తున్నారు. అందువల్ల ఈ మధ్య కాలంలో ఈ అంశంపై ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదని కొంత మంది రాజకీయ నిపుణలు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.