తెలంగాణ వ్యాప్తంగా 3,618 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు ఉన్నట్లు శాసనమండలిలో (council meetings 2021) ఎమ్మెల్సీ కవిత (MLC kavitha) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM kcr) .. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాలను ఎలాగైతే పెంచారో... ఈసారి 3,618 కౌన్సిలర్ల, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల వేతనాలు పెంచాలని కోరారు.
అభివృద్ధికై ఎంతో కృషి..
రాష్ట్రంలో మొత్తం 142 అర్బన్ లోకల్ బాడీస్ (Urban Local Bodies) ఉన్నట్లు మండలిలో స్పష్టం చేశారు. అందులో ఒక కోటీ 44 లక్షల మంది జనాభా ఉన్నట్లు వెల్లడించారు. వాటి అభివృద్ధి కోసం.. ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరంలో దాదాపు 2వేల 622 కోట్ల రూపాయాలు మంజూరు చేసినట్లు వివరించారు. ఆ నిధులతో శానిటైజ్ కార్మికులకు రెగ్యూలర్‌గా జీతాలు ఇవ్వడం, సీసీ ఛార్జెస్‌ను రెగ్యూలర్‌గా కట్టుకోవడం, 38 లక్షల చెత్త బుట్టల పంపిణీ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి అర్బన్ లోకల్ బాడీలో డంప్ యార్డ్‌లను ఏర్పాటు చేసినట్లు, పబ్లీక్ టాయిలైట్స్, వైకుంఠ ధామాలు, ఎల్ఈడీ స్ట్రీట్ లైట్స్, ఒపెన్ జిమ్స్ వంటి పనులకు ఖర్చు చేసినట్లు చెప్పారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా... నర్సరీలు, పట్టణ, ప్రకృతి వనాలు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. అంతేకాకుండా మున్సిపల్ బడ్జెట్లో 10శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయింటినట్లు తెలిపారు. అర్బన్లోకల్ బాడీస్ అభివృద్ధి కోసం... 3, 618 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఎంతో కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
''మన రాష్ట్రంలో 142 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అందులో 1 కోటీ 44 లక్షల మంది జనాభా ఉంది. వీటి అభివృద్ధి కోసం.. ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోంది. ఈ సంవత్సరంలో దాదాపు 2వేల 622 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాటిని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశాం. వీటిని 3, 618 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాలను ఎలాగైతే పెంచారో.. వీరికి కూడా జీతాలు పెంచాలి.
- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ''