ETV Bharat / state

MLC Kavitha Letter to CBI : 'ఎఫ్​ఐఆర్​లో నా పేరు లేదు.. రేపు విచారణకు రాలేను' - Delhi liquor scam case update

MLC Kavitha Letter To CBI : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తనకు నోటీసులివ్వడంపై ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పందించారు. సీబీఐ ఎఫ్ఐఆర్​లో తన పేరు లేదని.. ఈ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు.

mlc kavitha
mlc kavitha
author img

By

Published : Dec 5, 2022, 10:03 AM IST

Updated : Dec 5, 2022, 1:15 PM IST

MLC Kavitha Letter To CBI : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. రేపు విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత సీబీఐకి తెలిపారు. ఈ నెల 11, 12, 14, 15వ అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ఎఫ్ఐఆర్, కేంద్రం ఇచ్చిన ఫిర్యాదు కాపీని ఇవ్వాలని సీబీఐని కవిత కోరిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్ కాపీ వెబ్‌సైట్‌లో ఉందని ఈ మెయిల్ ద్వారా అధికారులు కవితకు తెలియజేశారు. అనంతరం వెబ్‌సైట్‌లోని అన్ని అంశాలు పరిశీలించిన కవిత.. నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని.. తన పేరు ఎక్కడా లేదని సీబీఐకి లేఖ రాశారు.

MLC Kavitha Letter To CBI in Delhi liquor scam case : ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన తాను సీబీఐ విచారణకు హాజరు కాలేనని అధికారులకు ఎమ్మెల్సీ కవిత సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో ఒక రోజు హైదరాబాద్​లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు.

'ఎఫ్​ఐఆర్​లో నా పేరు లేదు.. రేపు విచారణకు రాలేను'

ఇవీ చదవండి: కేంద్ర హోంశాఖ ఫిర్యాదు ప్రతి పంపండి: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

గ్రూప్‌-4కు ట్రై చేస్తున్నారా.. ఇలా చదివితే జాబ్ పక్కా..!

లూడో గేమ్​లో తనను తానే బెట్టింగ్ పెట్టిన మహిళ.. ఓడిపోయి ఇంటి యజమాని వశం!

Last Updated : Dec 5, 2022, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.