సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. హైదరాబాద్లో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో నిన్న రాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం కోఠిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
డీ హైడ్రేషన్ వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. వైద్యుల పరివేక్షణలో ఉన్న రాజాను కలిసిన కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: ఆమె సేవలకు గుర్తింపు..జాతీయ పురస్కారం