ETV Bharat / state

MLC Kavitha Chitchat in Twitter : 'సర్వేల్లో ఎవరు గెలిచినా ఎన్నికల్లో బీఆర్​ఎస్​దే గెలుపు.. ఈ వయస్సులో చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం'

MLC Kavitha Chitchat in Twitter : ఈసారి ఎన్నికల్లో బీఆర్​ఎస్ కచ్చితంగా​ సెంచరీ సాధిస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. సర్వేల్లో ఎవరు గెలిచినా.. ఎన్నికల్లో మాత్రం భారత్​ రాష్ట్ర సమితి హ్యాట్రిక్​ కొట్టబోతుందని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ (ఎక్స్) వేదికగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.

MLC Kavitha Replies to Netizens Tweets on X

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 10:56 PM IST

MLC Kavitha Replies to Netizens Tweets on X : బీఆర్​ఎస్​, బీజేపీ మధ్య ఏ ఒప్పందం లేదని.. తాము కేవలం రాజకీయ ప్రత్యర్థులమని ఎమ్మెల్సీ కవిత ట్విటర్​(ఎక్స్)లో పేర్కొన్నారు. సోషల్​ మీడియా వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పారు. అవి ఆమె మాటల్లోనే..

తెలంగాణ ప్రజలతో తనకున్న అనుబంధం రాజకీయం కాకుండా కుటుంబం లాంటిదని రాహుల్ గాంధీ అంటున్నారు. దానికి మీరు ఏమంటారు?

కవిత : తన ముత్తాత నెహ్రూ జీ తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేశారు. ఇది 6 దశాబ్దాల బాధలకు దారితీసింది. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో 369 మంది యువకులను బలి తీసుకున్నప్పుడు ఆయన నాయనమ్మ ఇందిరాజీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి రాజీవ్ జీ.. హైదరాబాద్ విమానాశ్రయంలో మన తెలంగాణ సీఎం అంజయ్య గారిని అవమానించారు. ఆయన తల్లి సోనియా జీ 2004లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు మౌనంగా ఉన్నారు. 11 రోజుల కేసీఆర్ గారి సత్యాగ్రహం తర్వాత, డిసెంబరు 09న తెలంగాణ ప్రకటించారు. కానీ 12 రోజుల తర్వాత తెలంగాణ ఇచ్చారు. రాహుల్​ జీ 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణపై మాట్లాడలేదు. అవును, ఇది కుటుంబ బంధం... ఆయన కుటుంబం తెలంగాణ ప్రజలను పదే పదే ద్రోహం చేశారు.

తెలంగాణలో మీకు నచ్చిన బెస్ట్​ టూరిస్ట్​ ప్రాంతం ఏంటి?

కవిత : కుంటాల వాటర్​ పాల్స్​

ప్రశ్న : చంద్రబాబు అరెస్ట్​ పై మీ అభిప్రాయం ఏమిటి?

కవిత : ఈ వయస్సులో చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోగలను. చంద్రబాబు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

మీ అంచనా ప్రకారం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఎన్ని ఎమ్మెల్యే సీట్లను గెలుస్తుంది?

కవిత : తెలంగాణ ప్రజల ఆశీస్సులతో సెంచరీ పక్కా.

ప్రశ్న : బీజేపీకి సీఎం అభ్యర్థి ఉన్నారని అమిత్​ షా అన్నారు. ఈసారి బీసీ ఓటర్లు ఓటు వేసే విధానంపై ఈ అంశం ఏమైనా ప్రభావం చూపుతుందా?

కవిత : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నాయకుడిని భర్తీ చేసి ఓసీకి ఇచ్చింది. భారతదేశంలో ఓబీసీ కుల గణనను నిర్వహించేందుకు కేంద్రంలోని బీజేపీ నిరాకరిస్తోంది. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించింది. పార్లమెంట్,అసెంబ్లీలలో 33% ఓబీసీ కోటా ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. ఇప్పుడు అదే బీజేపీ బీసీలను సీఎం చేస్తాం అంటోంది... నాకు కనిపిస్తున్నది మరో ఎన్నికల జిమ్మిక్.

బీఆర్​ఎస్​, బీజేపీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి?

కవిత : ఒప్పందం ఏమీ లేదు.. మేం రాజకీయ ప్రత్యర్థులం మాత్రమే. మేమంతా తెలంగాణ టీమ్​.

రానున్న అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ ప్రజలకు ఒక సందేశం.

కవిత : బాధ్యత ఉన్న ప్రభుత్వాన్ని.. భరోసా ఇచ్చే నాయకుడిని మళ్లీ ఎన్నుకోవాలి.

కేటీఆర్​ ఎందుకు ఎక్స్​లో పలువురి ఖాతాలను బ్లాక్​ చేస్తున్నారు.. దిల్లీ మద్యం కుంభకోణంలో మీ పాత్ర ఉందా? స్పష్టత ఇవ్వండి?

కవిత : సమంజసంగా అడిగిన ప్రతిదానికి మీకు జవాబు లభిస్తుంది. ఆ స్కామ్​ గురించి నాకు తెలియదు. అందులో నా పాత్ర ఏమీ లేదు.

ఈ కాలంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యువతకు ఇచ్చే మీ సందేశం?

కవిత : యువత ఎప్పుడూ మార్పుకు కేంద్రబిందువు... రండి రాజకీయాల్లో చేరండి... అలాగే ఉండండి. రాజకీయాలు పార్ట్ టైమ్ జాబ్ కాకూడదు.

మీరు 33% మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడారని అంటున్నారు; దీనికి విరుద్ధంగా, రాబోయే ఎన్నికలలో మహిళలకు ఇచ్చే బీఆర్​ఎస్​ పార్టీ టిక్కెట్లు ఇతరులకన్నా తక్కువ, 33% కాదు. మరి మీ పార్టీ సంగతేంటి?

కవిత : ఈ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు, అయితే కాంగ్రెస్ మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోతే బీజేపీ ఈ దేశ మహిళలను "పోస్ట్ డేటెడ్ చెక్" ఇచ్చి మోసం చేసింది.

హంగ్ అసెంబ్లీ ఉంటుందని పలు సర్వేలు చెబుతున్నాయి. దీని గురించి బీఆర్​ఎస్​ ఏమి చెబుతుంది?

కవిత : 2018లో కూడా అదే ట్రిక్ ప్లే చేశారు. 2018లో కూడా చాలా సర్వేలు ప్రజల్లోకి దూసుకెళ్లాయి.. కానీ బీఆర్‌ఎస్ మాత్రం భారీ మెజారిటీతో గెలిచింది. ఈసారి కూడా కాంగ్రెస్ & ఇతరులు సర్వేలను గెలవనివ్వండి. బీఆర్​ఎస్​ ఎన్నికల్లో గెలుస్తుంది.

మీరు, మీ సోదరుడు కేటీఆర్​ గురించి అందమైన జ్ఞాపకాన్ని చెప్పండి ?

కవిత : అతను చాలా బాధ్యత గల సోదరుడు. అతనితో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఒకటని చెప్పలేను.

తండ్రి తర్వాత మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు?

కవిత : మమత దీదీ.

చిరంజీవి గురించి మీ అభిప్రాయం చెప్పండి.. మీకు నచ్చిన నటుడు ఎవరు?

కవిత : చిరంజీవికి వీరాభిమానిని.. ఆతర్వాత అల్లు అర్జున్​.. తగ్గేదేలే.

MLC Kavitha Chit Chat With Media : 'రాష్ట్రంలో బీఆర్​ఎస్​దే అధికారం.. వంద సీట్లతో హ్యాట్రిక్​ సర్కారు ఏర్పాటు చేస్తాం'

సీఎం కేసీఆర్​ విజన్​ను ప్రతిధ్వనించేలా మాట్లాడిన గవర్నర్.. కవిత ట్వీట్.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.