గ్రేటర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బయటకొచ్చి ఓటు వేయాలని ఆమె కోరారు. ఆలోచించి తమకు నచ్చిన పార్టీకి ఓటేయాలని సూచించారు. ప్రజలంతా పాల్గొంటేనే పరిపూర్ణ ప్రజాస్వామ్యం అవుతుందని ఆమె అన్నారు.
హైదరాబాద్‌లో పోలింగ్ తక్కువ శాతం నమోదవుతుంది కాబట్టి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఎప్పటికప్పుడు వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పరిశీలన: ఎస్ఈసీ