ETV Bharat / state

దివ్యాంగులకు సాయమందించిన ఎమ్మెల్సీ కవిత - ఎమ్మెల్సీ కవిత తాజా వార్తలు

ఎమ్మెల్సీ కవిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన పలువురికి మూడు చక్రాల స్కూటీలను‌ అందించి వారికి చేయూతనిచ్చారు.

Mlc Kavitha
ఎమ్మెల్సీ కవిత
author img

By

Published : Apr 13, 2021, 5:29 PM IST

హైదారాబాద్ పురానాపూల్​కు చెందిన సూర్య ప్రకాశ్​, కుత్బుల్లాపూర్​కు చెందిన సయ్యద్ సలీం, సిరిసిల్లకు చెందిన పోచంపల్లి శ్రీనివాస్, శేఖర్, ఖానాపూర్​కు చెందిన సుధాకర్, వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన భరత్, షబానాలు దివ్యాంగులు. వీరు తమ పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ట్విట్టర్ ద్వారా దివ్యాంగుల దీన స్థితిని తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించారు. వారితో నేరుగా మాట్లాడి అండగా ఉంటానని ‌హామీ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్​లో ఆ ఏడుగురు దివ్యాంగులు ఎమ్మెల్సీ కవితను కలిశారు. కవిత వారందరికీ మూడు చక్రాల స్కూటీలను అందించారు. ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని వారికి భరోసానిచ్చారు. కోరిన వెంటనే స్పందించి, సాయం అందించిన కవితకి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: మాయ మాటలు చెప్పేవారిని మళ్లీ నమ్మొద్దు: జానారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.