విద్యుత్ వినియోగంతోనే కాళేశ్వరం నీటి ఎత్తిపోతల సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సాధారణ వర్షాపాతాన్ని కూడా తెరాస జలకళగా వర్ణించడాన్ని ఎమ్మెల్సీ తప్పుబట్టారు. కాళేశ్వరం నుంచి ఒక్క బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు వినియోగంపై నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని జీవన్‌రెడ్డి సూచించారు. ఎత్తిపోతల ద్వారా మధ్యమానేరు, ఎల్ఎండీ రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపాలని డిమాండ్ చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హుజురాబాద్ ప్రాంతాలు నీటిని పొందే అవకాశం ఉన్నా ఎందుకు పొందలేకపోతున్నారని ప్రశ్నించారు. దీనిపై ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించకపోవటంపై జీవన్‌రెడ్డి మండిపడ్డారు.
ఇదీ చూండండి :శాసన కమిటీల నియామకంపై సీఎం కసరత్తు