ETV Bharat / state

Protem Chairman: నేడు ప్రొటెం ఛైర్మన్​గా ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి బాధ్యతల స్వీకరణ

శాసనమండలి ప్రొటెం ఛైర్మన్​గా (Protem Chairman) ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి (Mlc Bhupal reddy) ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరిగే వరకు భూపాల్ రెడ్డి ప్రొటెం ఛైర్మన్ బాధ్యతల్లో ఉంటారు.

MLC Bhupal Reddy
ప్రొటెం ఛైర్మన్​గా ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి
author img

By

Published : Jun 4, 2021, 5:05 AM IST

శాసనమండలి ప్రొటెం ఛైర్మన్​(Protem Chairman)గా ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి (Mlc Bhupal reddy) ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ సభ్యత్వాల గడువు నిన్నటితో ముగిసింది. ఇద్దరు ప్రిసైడింగ్ అధికారుల పదవీకాలం ముగియడంతో ఆ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో సీనియర్ సభ్యుడైన భూపాల్ రెడ్డిని ప్రొటెం ఛైర్మన్​గా నియమించారు.

2007లో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఇప్పటికి మూడు పర్యాయాలు పెద్దలసభకు ఎన్నికయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రొటెం ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ హోదాలో మండలి ఛైర్మన్​గా విధులు నిర్వర్తిస్తారు. తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరిగే వరకు భూపాల్ రెడ్డి ప్రొటెం ఛైర్మన్ బాధ్యతల్లో ఉంటారు.

ఇదీ చూడండి: మల్కాజిగిరి డీసీపీ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.