Ramachandra Bharati released from Prison today : 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో ఏ1 నిందితుడు రామచంద్ర భారతి.. బెయిల్‌పై చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో నిన్న జైలు నుంచి విడుదలవగానే.. నకిలీ డాక్యూమెంట్ల కేసులో బంజారాహిల్స్ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఈ కేసులో గురువారం రాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ ఉదయం ఆయన మరోమారు విడుదలయ్యారు. రామచంద్ర భారతిపై 'ఎమ్మెల్యేలకు ఎర' కేసుతో పాటు మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏ3 సింహయాజి ఇప్పటికే బెయిల్ పై విడుదలకాగా.. ఏ2 నందకుమార్‌ను మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అసలేం జరిగిందంటే: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులైనా రామచంద్రభారతి, నందకుమార్‌లను బంజారాహిల్స్ పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. బోగస్ ఆధార్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో రామ చంద్ర భారతి, నందు కుమార్‌లను ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపర్చారు. దోమ మండలంలో సతీశ్ అనే వ్యక్తి భూమి వ్యవహారంలో బెదిరింపులు చేశారని ఫిర్యాదు మేరకు.. నందకుమార్ మీద ఐపీసీ 386, 387 సెక్షన్ల కింద నమోదైన కేసులో అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: రామచంద్రభారతి, నందకుమార్‌లను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు