MLA Vamshi followers humgama: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ అనుచరులు వీరంగం సృష్టించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై మద్యం మత్తులో బాణాసంచా కాల్చారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్నారని ప్రశ్నించిన వాహనదారులతో వాగ్వాదానికి దిగారు. సుమారు గంటకు పైగా హైవేపై వాహనాలను నిలిపేశారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఎంతసేపు ఆగాలని అడిగిన కొందరిపై వంశీ అనుచరులు దాడి చేసేందుకు యత్నించారు. ఇంత జరిగినా పోలీసులు దరిదాపుల్లో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
ఇవీ చదవండి:
మునుగోడులో క్రాస్ ఓటింగ్ భయం.. ప్రధాన పార్టీల్లో టెన్షన్ టెన్షన్
రేపు రాష్ట్రంలోకి ప్రవేశించనున్న రాహుల్ పాదయాత్ర, భారీ ఏర్పాట్లలో కాంగ్రెస్