ETV Bharat / state

ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలకు ఎమ్మెల్యే సీతక్క పరామర్శ

మంత్రి మల్లారెడ్డికి చెందిన ఆసుపత్రిపై దాడిచేసిన కేసులో అరెస్టు అయిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ఆమె ఘటనకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.

MLA Sitakka consulting NSUI activists
ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క
author img

By

Published : May 8, 2021, 1:49 PM IST

హైదరాబాద్ సురారంలోని మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేసిన కేసులో దుండిగల్ పోలీసు స్టేషన్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను కాంగ్రెస్‌ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. స్టేషన్‌లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ ఉన్నాడని తెసుకున్న ఎమ్మెల్యే అక్కడికి వెళ్లారు.

మంత్రి మల్లారెడ్డి చెరువు భూములు కబ్జా చేసి ఆసుపత్రి నిర్మించండని ఆరోపిస్తూ.. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు తమపై దాడి చేసి.. ఆసుపత్రి అద్దాలు పగులగొట్టారని డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు వెంకట్​తో పాటు మరో 12 మందిని అరెస్టు చేసి, వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి: తండ్రికి గుండెపోటు.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా బలిగొన్న ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.