ఆంధ్రప్రదేశ్ సీఎం పుట్టినరోజు సందర్భంగా ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజా వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ పేద విద్యార్థినిని ఆమె దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి తిరుపతి గర్ల్స్ హోమ్‌లో ఉంటున్న పుష్పకుమారి నీట్లో మంచి ర్యాంకు సాధించింది.
ఆర్థిక స్తోమత లేని ఆ ఆడబిడ్డను మెడిసిన్ చదివించే బాధ్యత తీసుకున్నారు. జగన్ జన్మదినం పురస్కరించుకుని రోజా ఈ నిర్ణయం తీసుకోవటంపై అభినందనలు తెలుపుతున్నారు.