ETV Bharat / state

Rajasingh Comments on ward offices : 'వార్డు ఆఫీసులతో ప్రజల పనులు అవుతాయన్న నమ్మకం లేదు' - Telangana latest news

MLA Rajasingh Latest Comments : వార్డు ఆఫీసుల వల్ల ప్రజలకు పనులు అవుతాయన్న నమ్మకం తనకు లేదని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అభిప్రాయపడ్డారు. ఇవాళ ప్రారంభమైన వార్డు కార్యాలయాల్లో పది రోజుల తరువాత ఒక్క వ్యక్తి కూడా ఉండరని విమర్శించారు. ప్రజా ధనం ఏ విధంగా ప్రభుత్వం వృధా చేస్తుందో అర్థం చేసుకోవచ్చునని ఆరోపించారు. మరోవైపు బక్రీద్ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి ఆవులు, ఎద్దులను అక్రమంగా హైదరాబాద్​కు తరలిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.

MLA Rajasingh
MLA Rajasingh
author img

By

Published : Jun 16, 2023, 3:59 PM IST

Raja Singh criticism of ward offices : హైదరాబాద్​లో ఇవాళ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వార్డు కార్యాలయాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పలు ఆరోపణలు చేశారు. వార్డు కార్యాలయాల్లో పది రోజుల తరువాత ఒక్క వ్యక్తి కూడా ఉండరని విమర్శించారు. వార్డు ఆఫీసుల వల్ల ప్రజలకు పనులు అవుతాయన్న నమ్మకం తనకు లేదని అభిప్రాయపడ్డారు. గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని గన్‌ ఫౌండ్రీ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో రాజాసింగ్ పాల్గొన్నారు.

ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజల డబ్బులు ఏ విధంగా ప్రభుత్వం వృధా చేస్తుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చునని దుయ్యబట్టారు. అలంకారప్రాయంగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. డ్రైనేజీ శుభ్రపరిచే వాళ్లు పదవి విరమణ పొందుతున్నారని.. వాళ్ల స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమించడం లేదని మండిపడ్డారు.

Rajasingh comments on cow conservation : మరోవైపు గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ కార్యకర్తపై ఉందని రాజసింగ్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆవులు, ఎద్దులను హైదరాబాద్‌కు అధిక సంఖ్యలో అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. బక్రీద్‌ సందర్భంగా ఆవులు, ఎద్దులను నగరంలో విచ్చలవిడిగా అమ్ముతున్నారని మండిపడ్డారు. 1977 చట్టం ప్రకారం గోవులను అమ్మకం, వధించడం నిషిద్ధమని గుర్తు చేశారు.

ఆవు రక్తం పడితే రాష్ట్రానికి మంచిదికాదని.. మహా పాపం చుట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ప్రభుత్వమే ఈ ఏడాది బక్రీద్‌కు పోలీసు రక్షణలో ఆవులను తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తోందని ఆరోపించారు. ప్రతి ఒక్క హిందూ కార్యకర్త గోరక్షణ చేయాలని రాజాసింగ్ సూచించారు.

GHMC Ward offices : పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యంగా వార్డు కార్యాలయాలను ఇవాళ హైదరాబాద్ నగర పరిధిలో ప్రారంభించారు. ఈ కార్యాలయాల్లో ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కారించే విధంగా సుమారు 10 సిబ్బంది ఉంటారు. రోడ్లు, డ్రైనేజీల వంటి వాటి నిర్వహణకు ఇంజినీరింగ్ సిబ్బంది, భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై టౌన్ ప్లానింగ్ ఉద్యోగస్థులు ఉంటారు. దోమల సమస్యకు ఎంటమాలజీ విభాగం అధికారులు అందుబాటులో ఉండనున్నారు.

అలాగే మహిళా సంఘాలకు ఉపయుక్తంగా ఉండేలా వార్డు కమ్యూనిటీ ఆఫీసర్, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయానికి వార్డు శానిటరీ జవాన్, విద్యుత్ శాఖ తరఫున వార్డు లైన్‌మెన్, తాగునీటి సరఫరా, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్, మురుగునీటి నిర్వహణకు జలమండలి నుంచి వార్డు అసిస్టెంట్, ఓ కంప్యూటర్ ఆపరేటర్​తో కలిపి మొత్తం 10 అధికారులు ఉంటారు. వీరు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత సులభమైన సేవలను అందిచనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.