ETV Bharat / state

MLA Rajaiah Muthireddy New Posts : రాజయ్యకు రైతు బంధు సమితి.. ముత్తిరెడ్డికి ఆర్టీసీ - ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి

MLA Rajaiah Muthireddy New Posts : వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డికి.. అలాగే కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన నందికంటి శ్రీధర్‌కు.. కల్వకుర్తి నియోజకవర్గంలోని జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్‌ గుప్తాకు నామినేటెడ్‌ పదవులను కట్టబెట్టారు సీఎం కేసీఆర్‌.

Four Persons Corporation Chairmans
CM KCR Appointed Four Persons Corporation Chairmans
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 7:51 AM IST

MLA Rajaiah Muthireddy New Posts : శాసనసభ ఎన్నికలు సమీపించిన తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురు నేతలకు నామినేటెడ్ పదవులు(CM KCR Appoints Naminated Posts) అప్పగించారు. టికెట్లు ఇవ్వని ఇద్దరు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్‌ను వీడి బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరిన నందికంటి శ్రీధర్‌తో పాటు ఇటీవల పార్టీలో చేరిన ఉప్పల వెంకటేశ్‌ గుప్తాకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు.

రాష్ట్ర రైతుబంధు సమితి(Rythumandhu Samiti) ఛైర్మన్‌గా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆర్టీసీ చైర్మన్‌(TSRTC Chairman)గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నియమించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేష్ గుప్తాను, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్‌లను నియమించారు. ఈ మేరకు నలుగురికి పదవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా రెండేళ్ల పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

MLA Thatikonda Rajaiah Supports Kadiyam Srihari : స్టేషన్​ఘన్​పూర్ ఈజ్ క్లియర్.. ఔను.. వాళ్లిద్దరూ కలిసిపోయారు

రైతుబంధు సమితి ఛైర్మన్‌గా రాజయ్య : స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య అసంతృప్తితో ఉన్నారు. తన అసహనాన్ని అనేక సమావేశాల్లో బహిరంగంగానే వ్యక్తపరిచారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన తర్వాత కడియం శ్రీహరి గెలవడానికి సహకరిస్తానని రాజయ్య చెప్పారు. అనంతరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యతో చర్చలు జరిపి ఆయనను రైతు బంధు సమితి ఛైర్మన్‌గా నియమించారు.

Nandikanti Sridhar Chairman of MBC Corporation : జనగామ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముత్తిరెడ్డిని బుజ్జగించడానికి.. ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిని ఆయనకు కట్టబెట్టారు. మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మతరావు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంతో విభేదించి.. కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బుధవారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అత్యంత వెనకబడిన తరగతుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులు అయ్యారు.

Uppala Venkatesh Gupta Vice President of Mission Bhagiratha : కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్‌ గుప్తా.. గత నెలలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబి గూటికి చేరారు. అప్పుడు ఆయన అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. స్థానికంగా వెంకటేశ్‌ గుప్తాకు పట్టు ఉండడం.. ముఖ్య సామాజిక వర్గ నేతగా రాష్ట్రంలో గుర్తింపు నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ కార్పొరేషన్‌ పదవిని కట్టబెట్టారు. మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడిగా నియమించారు. రెండేళ్లపాటు కొత్తగా నియమించినవారు పదవుల్లో ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Station Ghanpur assembly constituency issue : స్టేషన్​ఘన్​పూర్​లో రాజుకున్న రాజకీయవేడి.. టికెట్​పై ఎవరికి వారు ధీమా..!

Disputes in Warangal BRS Leaders : గులాబీవనంలో గుబులు.. సొంత పార్టీ నేతల మధ్య లోపించిన సఖ్యత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.