రాష్ట్ర జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం క్రీడలకు రూపాయి కూడా కేటాయించలేదని రఘునందన్‌రావు విమర్శించారు. కొత్త క్రీడాకారులకు ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో క్రీడల అంశాన్ని లేవనెత్తుతానన్న ఆయన.. జిమ్నాస్టిక్స్‌కు ప్రాధాన్యత తీసుకొచ్చేలా పనిచేస్తానని వెల్లడించారు.
ఇదీ చూడండి: కేంద్రం ఎన్ని చట్టాలు తెచ్చినా.. ప్రతీ గింజను కొంటాం: ఈటల