ETV Bharat / state

లీకేజీతో సంబంధం లేకుంటే కేటీఆర్‌ ఎందుకు స్పందించారు: రఘునందన్‌రావు - హైదరాబాద్​ న్యూస్​

MLA Raghunandan Rao comments on KCR: రైతులకు సాయం చేయడంలో కేంద్రం మొద్దు నిద్ర వహిస్తోందని సీఎం కేసీఆర్‌ చేసిన విమర్శలు అర్థరహితమైనవని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల సాయం ప్రకటించారని.. వాటిని ఎస్​డీఆర్​ఎఫ్​ నుంచే ఇస్తారని తెలిపారు. ఎస్​డీఆర్​ఎఫ్​ నిధుల్లో కేంద్రం 75 శాతం ఉంటుందని రఘునందన్‌రావు స్పష్టంచేశారు. 2014 నుంచి ఎస్​డీఆర్​ఎఫ్​కు కేంద్రం 3వేల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.

BJP MLA Raghunandan Rao
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు
author img

By

Published : Mar 24, 2023, 4:47 PM IST

MLA Raghunandan Rao comments on KCR: ఎన్నికల నామ సంవత్సరం అయినందునే.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు రైతులన్నపై ప్రేమ చూపిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీపై కేటీఆరే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. నీతి వ్యాఖ్యలు చెప్పే కేటీఆర్.. లాల్ బహదూర్ శాస్త్రిని ఎందుకు ఆదర్శంగా తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ కంప్యూటర్ నుంచి సమాచారం లీకైనా కేటీఆరే నైతిక బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు.

కేటీఆర్​ యువరాజుగా ఫీల్​ అవుతున్నాడు: తండ్రి మాదిరి.. కుమారుడు జర్నలిస్టులను తిట్టడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. పేపర్ లీకేజీపై సంబంధం లేకుంటే విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రాజు తర్వాత యువరాజుగా ఫీల్ అవుతున్నాడు కాబట్టే.. కేటీఆర్​ను రాజీనామా అడుగుతున్నామన్నారు. నిండు సభలో కౌలు లేదు.. కౌలు రైతు లేరన్న కేసీఆర్​కు ఎన్నికలు రాగానే కౌలు రైతులు గుర్తొచ్చారా అన్నారు. పేపర్​ లీకేజ్​ విషయంలో ప్రజల దృష్టిని మార్చే పథకంలో భాగంగానే కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారని విమర్శించారు.

రైతుల సంఖ్య ఎంతో దానిపై శ్వేతపత్రం ఇవ్వాలి: నిజంగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటామంటే బీజేపీ ప్రభుత్వం స్వాగతిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కౌలు రైతుల‌ సంఖ్య ఎంతో వ్యవసాయ శాఖ కమిషనర్ శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు ఎకరాలు దాటిన రైతులకు ఈ ఏడాది రైతుబంధు రాలేదన్నారు.

"ఎన్​డీఆర్​ఎఫ్ అంటే ఏమిటి?​, ఎస్​డీఆర్​ఎఫ్ అంటే ఏమిటి? వాటికి నిధులు ఎలా వస్తాయి? ముఖ్యమంత్రికి తెలియదా!. 2015లో మీరు ఒక జీవో ఇచ్చారు. అందులో రైతులకు పంట నష్టం జరిగితే ఎకరానికి మూడు వేల రూపాయలు వచ్చినవి. కేసీఆర్​ సవరించి రూ.10,000 ఇస్తున్నట్లు చెప్పారు. ఈ జీవో అమలు చేయడానికి ముఖ్యమంత్రికి 8 సంవత్సరాలు పట్టింది. అంటే ఈ 8 ఏళ్లలో ఎప్పుడు రైతుల సమస్యలు గుర్తుకు రాలేదా? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి. అందువల్లనే ఇప్పుడు రైతుల కష్టాలు గుర్తుకొచ్చాయి. ఈ విషయం ప్రతీ రైతు గుర్తుపెట్టుకోవాలి. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై కేటీఆరే బాధ్యత వహించాలి. లీకేజీతో సంబంధం లేకుంటే కేటీఆర్‌ ఎందుకు స్పందించారు. లీకేజీ నుంచి దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారు."- రఘునందన్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.