ETV Bharat / state

MLC elections in telangana 2021: ఆరుగురు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం.. - తెలంగాణ లేెటెస్ట్ అప్డేట్స్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు తెరాస అభ్యర్తులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్​, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి రిటర్నింగ్ అధికారి ఎన్నిక ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెరాస తరపున మాత్రమే అభ్యర్థులు నామినేషన్ వేయడంతో.. వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది.

MLA MLCS
MLA MLCS
author img

By

Published : Nov 22, 2021, 4:06 PM IST

Updated : Nov 22, 2021, 6:28 PM IST

(MLA quota MLC elections in telangana 2021) ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన తెరాస అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గులాబీ పార్టీ తరపున బరిలో దిగిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్​, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డికి రిటర్నింగ్ అధికారి(ఆర్వో) ఎన్నిక ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇతర పార్టీల నుంచిఎవరు బరిలోకి దిగకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆర్వో ప్రకటించారు.

అంతా బేరీజు వేసిన తరువాతే..

ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల(TRS Candidates For MLC) జాబితాపై భారీ కసరత్తే చేశారు. చివరి నిమిషంలో వెంకట్రామరెడ్డి, బండా ప్రకాశ్‌ల పేర్లు జాబితా (TRS Candidates For MLC)లో చేరాయి. అత్యంత వ్యూహాత్మకంగా.. పార్టీ సమీకరణాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్‌ నేతలైన కడియం, గుత్తాల ప్రాధాన్యం దృష్ట్యా వారికి అవకాశం ఇచ్చారు. పార్టీ సేవలకు గుర్తింపుగా తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఎంపిక చేశారు. తనకు సన్నిహితుడైన మాజీ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామరెడ్డితో పాటు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు పార్టీ నేత కౌశిక్‌రెడ్డి పేర్లను జాబితాలో చేర్చారు.

మండలిలో బలమైన బీసీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం కోసం రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యునిగా 2024 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉన్నా.. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికచేయడం గమనార్హం.

ఇవీ చదవండి: Local body MLC Elections Telangana: నిజామాబాద్‌ నుంచి మరోసారి పోటీ చేయనున్న కవిత

Last Updated : Nov 22, 2021, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.