కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్ఆర్డీ స్వచ్ఛంద సేవా ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ 15వ సర్కిల్ ఉప కమిషనర్ ఉమా ప్రకాష్, ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పలువురికి సరకులు అందజేశారు.
ఉపాధి లేని కుటుంబాలతోపాటు కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో అభాగ్యులను, నిరాశ్రయులను చేరదీయడం అభినందనీయమని అభినందించారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అరెస్టు.. ఫుట్‌పాత్‌పై బైఠాయించి నిరసన