ముస్లిం సోదరులు కరోనా నియమాలను పాటిస్తూ రంజాన్ వేడుకలను జరుపుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విజ్ఞప్తి చేశారు. పండుగను పురస్కరించుకుని.. ముషీరాబాద్ నియోజకవర్గం అడికిమెట్లోని ఓ మసీదు వద్ద.. ప్రభుత్వం తరఫున పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలా: హైకోర్టు