ETV Bharat / state

ఎన్ని సమస్యలున్నా ఆత్మహత్య చేసుకోవద్దు: మాగంటి - తెలంగణ వార్తలు

జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సూచించారు. రహమత్​నగర్​లో దంపతులు బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమన్నారు. మృతుల పిల్లలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

mla-maganti-gopinath-responds-on-couple-suicide-at-rahmath-nagar-in-hyderabad
ఎన్ని సమస్యలున్నా ఆత్మహత్య చేసుకోవద్దు: మాగంటి
author img

By

Published : Mar 13, 2021, 4:46 PM IST

జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. సమస్యలను అధిగమించాలే తప్ప నిరాశ చెందకూడదని సూచించారు. హైదరాబాద్​లోని రహమత్‌నగర్‌కు చెందిన దంపతులు సుబ్బారావు, సాయిలక్ష్మిలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

రహమత్‌నగర్‌కు చెందిన ఈ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. శుక్రవారం సాయిలక్ష్మి మృతి చెందగా... ఆమె భర్త సుబ్బారావు శనివారం మృతిచెందారు. మృతుల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ అంత్యక్రియలను ఎమ్మెల్యే గోపినాథ్ జరిపించాలని సూసైడ్ నోట్‌లో కోరగా... ఈ మేరకు ఎమ్మెల్యే ఆ దంపతుల అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిని ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: రేవ్​పార్టీ కేసు: ముమ్మరంగా కొనసాగుతున్న దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.