హైదరాబాద్ బాలానగర్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రభుత్వం లాక్డౌన్ విధించిన మొదటి రోజే ప్రజాప్రతినిధులు ఉల్లంఘించడంపై పలు విమర్శలొస్తున్నాయి. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ద్వారా బాలానగర్ ఏసీపీకి భాజపా నేతలు ఫిర్యాదు చేశారు.
బాలానగర్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి బుధవారం సుమారు 100 మందితో తన జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. భౌతిక దూరం పాటించకుండా టపాసులు పేలుస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితులు