హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం పైకప్పుల కూలిపోయిన ఘటనస్థలాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. భవన యజమాని నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.
కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం పైకప్పులు ఒక్కసారిగా కూలి పోయాయి. ఈ దుర్ఘటనలో శిథిలాలు మీద పడి ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడగా ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహయ చర్యలు చేపట్టారు. నాసిరకం నిర్మాణం కారణంగానే భవనం పై కప్పులు కూలాయని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
భవనం స్లాబ్ కూలిన ఘటనలో కార్మికులు చనిపోవటం బాధాకరం. మృతుడి కుటుంబానికి యజమాని నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. భవన యజమాని నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు. అక్రమ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. - మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
ఇవీ చదవండి: కూకట్‌పల్లిలో కూలిన భవనం స్లాబ్... ఇద్దరు మృతి
గ్రాండ్‌గా ఖేలో ఇండియా థీమ్ సాంగ్ లాంచ్.. స్టేజ్‌పై చిందులేసిన సీఎం