బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నిర్మాణ పనులను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజులు పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి పనులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎస్ఆర్డీపీ సౌజన్యంతో సుమారు రూ.390 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మించినట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. ఈ పైవంతెన వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వివరించారు. తెరాస ప్రభుత్వ హయాంలో అనేక చోట్ల ఫ్లైఓవర్లతో పాటు అండర్ గ్రౌండ్ రోడ్లనూ నిర్మించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ఇదీ చూడండి: Eatala : హైదరాబాద్ చేరుకున్న ఈటల.. స్వాగతం పలికిన అనుచరులు