ETV Bharat / state

'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్​లో పెట్టుకుంటే బాగుంటుంది' - తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2020

అసెంబ్లీలో మాట్లాడనివ్వటంలేదు. బయట సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు.. అలాంటి అసెంబ్లీ ఇంకెందుకు. కేసీఆర్ ఫామ్ హౌస్​లో అసెంబ్లీ పెట్టుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మాట్లాడుతున్నపుడు రెండు నిమిషాలకే బెల్​ కొడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

mla komatireddy rajagopal reddy comments Assembly should be held at KCR Farm House
'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్​లో పెట్టుకోవాలి'
author img

By

Published : Sep 8, 2020, 5:24 PM IST

'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్​లో పెట్టుకోవాలి'

''ఓవైపు పీవీ నరసింహారావు ఘన కీర్తిని పొగిడి, సోనియాను దేవత అన్న కేసీఆర్​కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. ఓ సందర్భంలో కేటీఆర్ కాంగ్రెస్​ను బొంద పెడతా అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను మాట్లాడనివ్వటం లేదు.

తెలంగాణ ప్రజలు కేసీఆర్ లాంటి నియంతను సీఎంగా కోరుకోవట్లేదు. అనేక మంది యువకుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వటానికి కూడా కేసీఆర్ సమయం ఇవ్వట్లేదు. బయట సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు.. అసెంబ్లీలో మాట్లాడనివ్వటంలేదు. అలాంటి అసెంబ్లీ ఇంకెందుకు. కేసీఆర్ ఫామ్ హౌస్​లో అసెంబ్లీ పెట్టుకోవాలి.''

- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు. మాట్లాడుతున్నపుడు రెండు నిమిషాలకే బెల్​ కొడుతున్నారు. ఇదేక్కడి ప్రజాస్వామ్యం. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన చర్చలను జరగనివ్వటం లేదు. 2004లో పీవీ చనిపోయినప్పుడు తెరాస నేతలు కనీసం అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. తెలంగాణ గడ్డపై పుట్టిన పీవీకి భారతరత్న ఇవ్వటంపై మిత్రపక్షం ఎంఐఎం బహిష్కరించడంపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.

- ఎమ్మెల్యే సీతక్క

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నయి. బీఏసీ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులకు అవకాశం ఇస్తామంటే మేము నమ్మాము. ప్రజల గొంతు వినిపించేందుకు ఆరుగురు సభ్యులు ప్రయత్నిస్తుంటే సభాపతి సమయం ఇవ్వాలి. ప్రయివేట్ టీచర్లు, చేనేత కార్మికులు, ఆదివాసీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సభాపతి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

- ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

ఇదీ చూడండి : 'రోజుకు ఆరు నిమిషాలే ఇస్తే ఎలా మాట్లాడాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.