ఇవీ చూడండి:-
'కొండగట్టు బాధితులకు న్యాయం చేయండి' - జగిత్యాల జిల్లా కొండగట్టు
సెప్టెంబర్ 11 జగిత్యాల జిల్లా ప్రజలకు విషాదమైన దినంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి శాసనమండలిలో వ్యాఖ్యానించారు. కొండగట్టు ప్రమాదం జరిగి రెండు సంవత్సరాలు జరిగిన సందర్బంగా ఆయన శాసన మండలిలో కొండగట్టు ప్రమాదం గురించి ప్రస్తావించారు. నిషేధించబడిన ఘాట్ రోడ్డులో బస్సు ప్రయాణం చేయడం వల్లే కొండగట్టు రోడ్డు ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆయన అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి, గాయాలపాలైన వారికి ప్రభుత్వం చేసిన సహాయం కంటితుడుపు చర్యగానే ఉందని ఆయన అన్నారు. రవాణా శాఖ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. ప్రభుత్వం బాధితులకు ఇంకా సరైన న్యాయం చేయలేదన్నారు. ఇప్పటికైనా బాధితులకు సరైన పరిహారం అందించి.. బాధితుల కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగం అందించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. బాధితులంతా దళిత, బలహీన వర్గాల వారేనని.. వారి పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా ఉందని.. ప్రభుత్వం స్పందించి కొండగట్టు బాధితులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
'కొండగట్టు బాధితులకు న్యాయం చేయండి'
ఇవీ చూడండి:-