హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్ రాఘవేంద్రకాలనీలో వరద బాధితులకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ రూ. 10వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. డివిజన్లో సుమారు 70 మందికి లబ్ధిదారులకు నగదు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మిగిలిన అర్హులను గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, ఉప కమిషనర్ ప్రశాంతి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఈనెల 27 నుంచి వ్యవసాయ డిప్లోమా కౌన్సిలింగ్