కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు చేశారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, దోమలగూడ, ముషీరాబాద్, రాంనగర్, విద్యానగర్, గాంధీనగర్ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకుల కదలికలపై నిఘా పెట్టారు.
దోమలగూడలోని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డిలను చిక్కడపల్లి పోలీసులు గృహనిర్బంధం చేశారు. తమ దీక్షను భగ్నం చేసేందుకే గృహ నిర్బంధాలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం