హైదరాబాద్ నగరంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో నాంపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రార్థనా స్థలాల్లో స్ప్రే చేసేందుకు శానిటైజర్, పిచికారి యంత్రాలని పంపిణీ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ మాజీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో వాటిని అందించారు.
నాలుగు దేవాలయాలతోపాటు రెండు చర్చీలు, 10 మజీద్లకు అందించారు. మిగితా ప్రార్థనా స్థలాల్లోకి నేరుగా వారి కార్యకర్తలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ద్రావణం అయిపోయిన తర్వాత జీహెచ్ఎంసీకి ఎల్లప్పుడు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చూడండి : 'ఆలేరును ఏడారి చేస్తోన్న కేసీఆర్ సర్కార్'