MLA Sudheer Reddy Comments On TRS and BJP: ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో బీజేపీకి తప్పకుండా ఉచ్చు బిగుసుకుంటుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పాత్ర లేదంటున్న ఆ పార్టీ నేతులు కోర్టు గడప ఎందుకు తొక్కారని ప్రశ్నించారు. స్వామీజీల పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి బీజేపీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందని తెలిపారు. ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలని బీజేపీ మూడు రోజుల శిక్షణా శిబిరాల్లో శిక్షణ ఇస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అభివృద్ది గురించి చెప్పి ఓట్లడిగే పరిస్థితి బీజేపీకి లేదని సుధీర్ రెడ్డి ఆరోపించారు. తాము రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనమయినట్లు తెలిపారు. మాణిక్కం ఠాగూర్ సమన్లకు చట్టపరంగా బదులిస్తానని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు కాలానుగుణంగా అదృశ్యమవుతాయని అందులో కాంగ్రెస్ పార్టీ ఒకటిని పేర్కొన్నారు. కాంగ్రెస్ను నడిపించే సమర్థ నేత ఎవ్వరూ లేరని సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
"స్వామీజీల ముసుగులో చేసే దొంగతనాలు.. పచ్చి దొంగలు అడ్డంగా బుక్కయ్యారు. దానిని అడ్డం పెట్టుకొని ఏదో విధంగా ప్రయత్నాల్లో బయటపడాలని, లేకపోతే విచారణ వాయిదా వేయాలని రకరకాల గడపలు తొక్కుతున్నారు. అన్ని గడపల్లో వారికి చిక్కు ఎదురవుతోంది.. కొన్ని పార్టీలు కాలం కలిసిరాక కాలానుగుణంగా అదృశ్యమైపోతున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. వారికి ఎవరో కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ, నిబద్ధత వదిలి 20సంవత్సరాలు గడిచిపోయింది." -దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే
ఇవీ చదవండి: 'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. సిట్ విచారణ కొనసాగాల్సిందేనన్న సుప్రీంకోర్టు
రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదల.. సుప్రీంలో కాంగ్రెస్ సవాల్!