హుజూరాబాద్ ఉపఎన్నికలో భాజపా, కాంగ్రెస్ కలిసి పని చేశాయనే దానికి కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లే నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. తెరాసను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు కలిసి పని చేశాయని ఆరోపించారు. కమలం కింద పడిపోకుండా చేయి అందించి మరీ గెలిపించారని విమర్శించారు. దిల్లీలో శత్రువులుగా ఉంటూ రాష్ట్రంలో మిత్రులుగా పనిచేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెరాస ఒక్క ఓటమితో కుంగిపోదని అన్నారు.
ఆర్ఆర్ఆర్ అంటే రాజాసింగ్, రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి అని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ ఇకనైనా తెరాస నేతలపై విరుచుకపడటం ఆపి... హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఎలా తీసుకొస్తారో ప్రజలకు ఈటల రాజేందర్, భాజపా నేతలు వివరించాలన్నారు. హుజూరాబాద్ ఎన్నికలో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కై.. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీగా అవతరించాయని ఆరోపించారు.
ఇదీ చూడండి: