శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుంటామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. పది డివిజన్లలో తొమ్మిదింటిలో విజయం సాధించామని ఆయన తెలిపారు. తెరాసలో టికెట్ దక్కని నాయకులు మిన్నకుండిపోవడంతో పోలింగ్‌శాతం తగ్గినట్లు స్పష్టం చేశారు. ఒక్క డివిజన్లో మాత్రమే స్వల్పతేడాతో ఓటమి చెందామని ఆయన తెలిపారు.
రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా సమీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. అత్యధిక ఓట్లు గల ఈ నియోజకవర్గంలో వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదని ఎమ్మెల్యే అన్నారు.