లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో రక్త నిధులు తగ్గిపోయాయని మంత్రి కేటీఆర్ సలహా మేరకు ఆల్విన్ కాలనీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, యువ నాయకులు రామకృష్ణ గౌడ్. ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు.
కరోనా సమయంలో ఎవరూ రక్తం కోసం అవస్థలు పడకూడదని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకే అన్ని డివిజన్లలో తెరాస నాయకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని తెలంగాణ ప్రభుత్వం 12 కిలోల బియ్యంతో పాటు 1500 రూపాయలను అందజేస్తోందని వివరించారు.
ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి