ETV Bharat / state

మహిళలను మోసం చేసిన సైబర్​ నేరగాళ్ల అరెస్టు!

మనీ సర్క్యులేషన్​ స్కీమ్ పేరుతో మహిళలను మోసం చేస్తున్న సైబర్​ నేరగాళ్లను సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్​కి చెందిన ముగ్గురు మహిళలను మోసం చేసిన సుబోత్​, అతడి స్నేహితులను పోలీసులు అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు.

Miyapur  Police Arrest Cyber Cheaters in
మహిళలను మోసం చేసిన సైబర్​ నేరగాళ్ల అరెస్టు!
author img

By

Published : Aug 4, 2020, 8:41 PM IST

మనీ సర్క్యులేషన్​ స్కీమ్​ పేరుతో మహిళలను మోసం చేస్తున్న నలుగురు యువకులను సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. స్కీములో పెట్టుబడి పేడితే.. లక్షల్లో డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి.. రూ.15 లక్షలు వసూలు చేశారు. మియాపూర్​కి చెందిన సుబోత్ అతని స్నేహితులు దీక్షిత్​, ఉదయ్​, జీవన్​, రాహుల్​ మలాని కలిసి ఒక మహిళను ట్రాప్​ చేసి డబ్బులు కాజేయడమే కాకుండా.. వేధింపులకు గురి చేసి.. అసభ్యంగా ప్రవర్తించారని సదరు బాధితురాలు మియాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతులను అరెస్టు చేశారు. డబ్బులకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.