హైదరాబాద్ కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్బికాలనీలో పలు అభివృద్ధి పనులకు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథ పనులతోపాటు, మురుగునీటి కాలువ పనులను 7కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక కృష్ణానగర్ కాలనీ నుంచి రాజారాజేశ్వరి ఫంక్షన్ హాల్ వరకు సుమారు 7 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?