ETV Bharat / state

మనిషన్నాక... కూసింత మానవత్వం ఉండాలి

చరిత్రలో వర్ణ, కుల, మత వివక్షలు ఇప్పటి వరకూ చూశాం. ఇప్పుడు వీటికి కరోనా వివక్ష కూడా తోడైంది. ఫలానా వ్యక్తికి కరోనా సోకిందంటే చాలు... బాధితుడి కన్నా చుట్టుపక్కల వాళ్లే ఎక్కువ ఆదుర్దా అవుతున్నారు. అంతెందుకు..? ఇంట్లో వాళ్లే వింత జంతువుని చూసినట్టు చూస్తున్నారు. అదేమంటే.. ఒక్కొక్కరి నుంచి ఒక్కో సమాధానం. కరోనా సోకిందని ఇల్లు ఖాళీ చేయాలని ఒకరు..అసలు ఇంటికే రావొద్దని మరొకరు! ఈ వైరస్ ఎన్నో గుణపాఠాలు నేర్పింది అనుకుంటున్నాం కానీ...ముందుగా మనం నేర్చుకోవాల్సిన పాఠం... మానవత్వం.

missing-humanity-in-corona-time
మనిషన్నాకా... కూసింత మానవత్వం ఉండాలి
author img

By

Published : Jul 26, 2020, 9:51 AM IST

ఓ వ్యక్తికి రెండు రోజులుగా కాస్త నలతగా ఉంటోంది. తరచు జ్వరం, పొడి దగ్గు వస్తోంది. అనుమానంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైద్యులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వైరస్ సోకిందన్న దిగులుతో ఇంటికి వచ్చాక అతనికి అంతకన్నా పెద్ద సమస్య ఎదురైంది. కరోనా వచ్చిందన్న కారణంగా... భార్య ఇంట్లోకి రానివ్వలేదు. చుట్టుపక్కల వాళ్లు సర్ది చెప్పాల్సింది పోయి.. ఆమెకే వంత పాడారు. అక్కడ ఉండటానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. బతిమాలో.. బామాలో ఇంట్లోకి వెళ్దామనుకుని గంటల తరబడి గడప ముందే కూర్చున్నా లాభం లేకుండా పోయింది. చేసేదేమీ లేక బరువైన గుండెతో ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇదేమీ కల్పిత కథ కాదు. ఈ కరోనా కష్టకాలంలో ఇలా వివక్షకు గురై మనోవేదనతో కుంగిపోతున్న వారు కుటుంబానికొకరు అన్నట్టుగా ఉన్నారు.

అవగాహన లోపం..

మన యుద్ధం వ్యాధితో కానీ...బాధితుడితో కాదు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అవగాహన కల్పిస్తున్నాయి. సందుసందులోనూ ఆటోల్లో మైక్‌లు పెట్టి మరీ అదే విషయం చెబుతున్నాయి. ఎవరికి కాల్​ చేసినా... ఫోన్లలో అదే హలో ట్యూన్‌. పొద్దున్న లేచింది మొదలు నిద్రపోయే వరకు అన్నీ కరోనా వార్తలే. సామాజిక మాధ్యమాల్లోనూ ఇవే పోస్టులు. కరోనా వచ్చినా ఏం పరవాలేదు. ధైర్యంగా ఎదుర్కొందాం అని ఓ వీడియో కనిపించగానే... వాట్సప్‌ గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేయటం, షేర్‌ చేయటం ఇప్పటి దినచర్యలో భాగమైంది. అంత అవగాహన, చైతన్యం ఉన్నప్పుడు ఓ వ్యక్తికి వైరస్ సోకితే ఎలా ప్రవర్తించాలన్న ఆలోచన ఎందుకు లేకుండా పోతోందన్నదే అర్థంకాని విషయం.

భూతద్దం వేసినా దొరకట్లే..

అపార్ట్‌మెంట్లలో ఓ ఫ్లాట్‌లో ఎవరికైనా వైరస్ సోకితే.. అంతే! చుట్టు పక్కల వాళ్లంతా డాబాలు ఎక్కి... ఆ అపార్ట్‌మెంట్‌ను ఓ వింత భవనంగా చూస్తున్నారు. ఇక అద్దె ఇళ్లల్లో ఉన్న వారికి కరోనా సోకిందంటే.. వాళ్లకు కష్టాలు మొదలైనట్టే లెక్క. అప్పటికప్పుడు ఖాళీ చేయాల్సిందే. ఉన్నపళంగా వెళ్లిపోతే వాళ్లకు నిలువ నీడ లేకుండా పోతుంది కదా... మనమే కాస్త జాగ్రత్తలు తీసుకుంటే పోతుంది కదా అని ఆలోచించే యజమానులు భూతద్దం వేసి వెతికినా దొరకటం లేదు. కరోనా వచ్చిన తల్లిదండ్రులను పిల్లలు ఇంట్లోకి రానివ్వలేదు. కరోనా సోకిందన్న అనుమానంతో భార్యను పుట్టింట్లోనే ఉండమంటున్న భర్తలు ఉన్నారు. ఓ ఊరిలో ఓ కుటుంబంలోని వారికి వైరస్‌ సోకిందని వెలివేస్తే... పశువుల పాకలో తలదాచుకున్న ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి.

కనీసం ఫోన్ చేసినా చాలు..

ఎవరికి వారు కరోనా తమకు రాదనుకుని అజాగ్రత్తగా ఉండటం, సోకినవారిని చిన్నచూపు చూడటం, కొందరు వారిపై భౌతిక దాడులకూ పాల్పడటం అవగాహన రాహిత్యమే. అలాంటివారు తమకు, కుటుంబ సభ్యులకు వ్యాధి ఉందని తెలిసి తీవ్ర భయాందోళనలకు గురి కావడానికి అపోహలే కారణం. ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆత్మీయమైన పలకరింపు, కాస్తంత ఉపశమనం కలిగించే మాటలే చాలు. చికిత్సలో అది కూడా ఓ భాగమే అంటారు వైద్యులు. ఇప్పుడు కరోనా బాధితులను నేరుగా వెళ్లి కలిసి మాట్లాడే అవకాశం లేకపోవచ్చు. కానీ కనీసం ఫోన్‌ చేసైనా ధైర్యం చెబితే తప్పేముంది..? ఆ వాట్సాప్‌లో, యూట్యూబ్‌లోని చిట్కాలు వివరిస్తే పోయేదేముంది..? మనకు కష్టమొస్తే మాత్రం ఇలాంటి పలకరింపులు కోరుకోమా..?

మళ్లీ అలాంటి వ్యవస్థలు రావాలి...

పరిస్థితులు ఇలాగే కొనసాగితే కరోనా కన్నా మానవత్వ లోపాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన దుస్థితీ రావచ్చు. ఒకప్పుడు హెచ్‌.ఐ.వి-ఎయిడ్స్‌ వ్యాధి విషయంలోనూ ఇవే పరిస్థితులు చూశాం. తరవాత అవగాహన పెంచుకుని ప్రజలు కుదురుకున్నారు. అప్పట్లో ఆరోగ్య నిర్వహణ విషయంలో కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడింది. అనేక స్వచ్ఛంద సంస్థలూ ముందుకొచ్చి పని చేశాయి. అయితే ఇది దీర్ఘకాలం సాగిన ప్రక్రియ. వ్యాధిగ్రస్థుల్లో భయాందోళనలు ప్రబలకుండా అడ్డుకోవడం, సమాజంలో అవగాహన పెంచి రోగుల పట్ల ఆదరణ చూపడం లక్ష్యాలుగా కార్యాచరణ సాగాలి. కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థులతో అప్పట్లో ఒక వ్యవస్థే ఏర్పడింది. అది నేటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. కరోనా విష వలయంలో మానవ సంబంధాలు క్షీణించిపోతున్న తరుణంలో యుద్ధప్రాతిపదికన ఈ తరహా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

మానవ సంబంధాలు ఇలా బలహీన పడుతున్నాయంటే... సమాజానికి ఏదో చేటు జరగనుందనే అర్థం. వ్యక్తుల మధ్య అనురాగం, ఆప్యాయతలు లోపిస్తాయి. మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. ఈ పరిస్థితి కరోనా వ్యాధికన్నా ప్రమాదకరమైనది. వ్యాధి పట్ల అపోహలు తద్వారా పెరిగిన భయం... వీటిని సకాలంలో అదుపు చేయకపోతే అవే సమాజంలో విపరీత ధోరణులకు దారి తీస్తాయి. ఇప్పటికే ప్రభుత్వాల ఆరోగ్య వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడిని కరోనా పెంచుతోంది. రాబోయే రోజుల్లో ఇది పెనుభారమైతే చివరికి నలిగిపోయేది ప్రజలే. ప్రస్తుతం సమాజంలో అదే జరుగుతోంది. కరోనాపై సమరంలో ప్రజలను మానసికంగా సన్నద్ధంగా ఉంచాలి. ఆ సన్నద్ధత సరైన సమాచారం, కౌన్సిలింగ్‌తోనే సాధ్యం. ప్రకృతి నియమాల ప్రకారం మనిషి పుట్టుక, మరణం అనివార్యం, కానీ మానవత్వం చనిపోవడం మానవ జాతికే ప్రమాదం.

ఇదీ చూడండి: ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు.. లాక్​డౌన్​ విధింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.