ETV Bharat / state

కిడ్నాప్, హత్య: డబ్బు కోసమేనా, లేక.. - హైదరాబాద్​లో చేపల వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్​లో చేపల వ్యాపారి హత్య తీవ్రకలకలం రేపింది. రమేష్​ను అపహరించిన దుండగులు... దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి పడేశారు. ఇంటి నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు రెండురోజుల క్రితం కిడ్నాపైన వ్యాపారి రమేష్​గా గుర్తించారు. ఈ హత్యోదంతంలో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

SR_NAGAR_MURDER
కిడ్నాప్, హత్య: డబ్బు కోసమేనా, లేక..
author img

By

Published : Feb 5, 2020, 2:47 PM IST

కిడ్నాప్, హత్య: డబ్బు కోసమేనా, లేక..

హైదారాబాద్​ జూబ్లిహిల్స్​ పరిధిలోని జవహార్​నగర్​లో దారుణం జరిగింది. చేపల వ్యాపారిని అపహరించి క్రూరంగా హత్యచేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈనెల 1న బోరబండకు చెందిన చేపల వ్యాపారి రమేశ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అతడి కుటుంబ సభ్యులు ఎస్​ఆర్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేశ్‌ను ఈఎస్‌ఐ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి రమేశ్‌ ఆచూకీ కోసం రెండురోజులుగా ప్రయత్నించారు.

విచారణ వేగవంతం

జవహార్​నగర్​లోని ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తుందనే స్థానికుల సమాచారంతో వెళ్లిన పోలీసులు... హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పడేసినట్లు గుర్తించారు. ఆ మృతదేహం రమేశ్​ది​గా తేల్చారు. ఈనెల 1వ తేదీన రమేశ్‌ను అపహరించి... మరుసటి రోజే అతన్ని హతమార్చి గోనె సంచిలో చుట్టి గదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ.కోటి ఇవ్వాలని ఫోన్‌ చేసిన వ్యక్తులెవరు, ఆ ఫోన్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు సేకరిస్తున్నారు.

డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం...

రమేశ్‌ ఇటీవల తనకున్న ఆస్తులను విక్రయించి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్నాపర్లు అడిగిన డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని... ఇంతటి దారుణానికి ఒడిగతారని అనుకోలేదని వాపోతున్నారు. కేవలం డబ్బుకోసమే ఈ హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

చేపల వ్యాపారంలో రమేశ్ బాగా సంపాదించుకున్నట్లు తెలుసుకున్న వ్యక్తులే అతన్ని అపహరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కిడ్నాప్​ ఉదందం పోలీసులకు తెలియడం వల్ల హత్యకు ఒడిగట్టారని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: హాలియాలో పాల వ్యాపారి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.