హైదరాబాద్ లాలాపెట్‌లోని చంద్రబాబు నగర్‌లో ఉంటున్న బాధితురాలు.. కాచిగూడ బ్రిస్టిల్‌కోన్ ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ పనిచేస్తుంది. బాలికకు అదే ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ ఇంఛార్జ్‌గా పని చేస్తున్న రవి(50) నిత్యం నిమ్మ రసంలో మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేసేవాడని బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఇప్పుడు ఆమె 9నెలల గర్భవతి. గతంలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన రవీందర్ రెడ్డితో కలిసి రవి చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లి అబార్షన్ చేయించేందుకు చూశారని బంధువులు ఆరోపించారు. అక్కడ వీలుకాక పోవడం వల్ల హైదరాబాద్‌లో బాలికను ఇంటివద్దే వదిలి వెళ్లిపోయారని తెలిపారు. రవిని, అతనికి సహకరించిన రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితురాలి బంధువులు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీచూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్
నిమ్మరసంలో మత్తుమందు కలిపి రోజూ అత్యాచారం - MINOR GIRL GET PREGNANCY
ఓ మైనర్‌ను మాయమాటలతో గర్భవతిని చేసాడంటూ కాచిగూడలోని బ్రిస్టిల్‌కోన్ హాస్పిటల్ ముందు బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో పని చేస్తున్న రవి.. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న బాలికకు నిమ్మరసంలో మత్తుమందు కలిపి రోజు అత్యాచారానికి పాల్పడేవాడని వారు ఆరోపించారు.