ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే పెద్ద హిందువు ఉన్నారా?: మంత్రి తలసాని - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

dudimetla balarajyadav: ధాన్యం కొనుగోలు అంశంలో కూడా భాజపా, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ధ్వజమెత్తారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్​లోని రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సంస్థ కార్యాలయంలో మంత్రి సమక్షంలో ఆ సంస్థ ఛైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తలసానితో పాటు మంత్రులు జగదీష్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. విపక్షాలు, కొన్ని శక్తులు ఓర్వలేక కేసీఆర్ కుటుంబాన్ని నిందిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తీవ్రంగా తప్పుబట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే పెద్ద హిందువు ఉన్నారా?: మంత్రి తలసాని

author img

By

Published : Dec 30, 2021, 6:29 PM IST

dudimetla balarajyadav: రాష్ట్రంలో తాడు బొంగురం లేని కాంగ్రెస్, భాజపా ఇష్టమొచ్చినట్లు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాయని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆక్షేపించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్​లోని రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సంస్థ కార్యాలయంలో మంత్రి సమక్షంలో ఆ సంస్థ ఛైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన తెరాస నాయకులు, శ్రేణులు కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాలరాజుయాదవ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎంతగానో అభివృద్ధి జరిగింది..

minister talasani comments on bjp: ప్రతిసారి భాజపా హిందుత్వాన్ని ముందుకు తీసుకొస్తోందని... ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే పెద్ద హిందువు ఉన్నారా అని మంత్రి తలసాని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వయంగా నిర్మించడమే కాకుండా కొమరవెల్లి మల్లన్న, వేములవాడ, భద్రాచలం దేవస్థానాలను ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. విశిష్ట కృష్ణ, గోదావరి పుష్కరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ సీఎం అన్ని వర్గాల మనసులు చూరగొన్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలు అంశంలో కూడా భాజపా, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సాధనలో వెన్ను వెరవకుండా పనిచేసిన బాల్క సుమన్, గాదరి కిషోర్ నుంచి సాయిచంద్, బాలరాజు లాంటి యువకులకు రాజకీయ, అధికార పదవుల్లో సైతం ముఖ్యమంత్రి గొప్ప అవకాశం కల్పించి ప్రజాసేవ చేసే భాగ్యం కలిగించారని మంత్రి తలసాని తెలిపారు.

ఆ ఘనత ప్రభుత్వానిదే..

వరిధాన్యం విషయంలో రాష్ట్రంలో డ్రామాలు జరుగుతున్నాయి. రైతుల అభివృద్ధి కోసం రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. పెట్టుబడి సాయాన్ని కూడా అందించే పథకం దేశంలో ఎక్కడా లేదు. ఇరిగేషన్​ ప్రాజెక్టుల విషయానికొస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసిన ఘనత ప్రభుత్వానిదే. -తలసాని శ్రీనివాస్​ యాదవ్​, రాష్ట్ర మంత్రి

ఓర్వలేకనే..

minister srinivas goud: సాధారణంగా క్రియాశీలక రాజకీయాల్లో నిబద్ధత, ఓపిక, సహనం ఉంటే ఉత్తమ అవకాశాలు వస్తాయనడానికి బాలరాజు లాంటి యువకులే ఓ నిదర్శమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత గీత, చేనేత, మత్స్యకార వృత్తులు గణనీయంగా మెరుగుపడుతుంటే... విపక్షాలు, కొన్ని శక్తులు ఓర్వలేక కేసీఆర్ కుటుంబాన్ని నిందిస్తున్నాయని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు.

తెలంగాణ వచ్చినందుకు ప్రతి ఒక్కరు గౌరవంగా బతుకుతున్నారు. ఇవాళ కులాలు, వృత్తులు బాగుబడుతుంటే కొందరికి నచ్చట్లేదు. కొన్ని కుటుంబాలకు నచ్చడం లేదు. అందుకే కేసీఆర్​ను గానీ, కేసీఆర్​ కుటుంబాన్ని నిందిస్తున్నారు. -శ్రీనివాస్​ గౌడ్​, రాష్ట్ర మంత్రి

ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే పెద్ద హిందువు ఉన్నారా?: మంత్రి తలసాని

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.