రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెరాస మహాధర్నా చేపట్టిందని మంత్రి హరీశ్‌రావు (harish rao) అన్నారు. రేపు తలపెట్టిన మహాధర్నా ఏర్పాట్లను మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో (minister talasani srinivas yadav) కలిసి పరిశీలించారు (Maha Dharna arrangements). ఇందిరా పార్కు వద్ద తెరాస చేపట్టనున్న ధర్నాకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్ పరిశీలించారు (Maha Dharna arrangements at Indira Park). అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తమది ప్రజల పక్షమని హరీశ్‌రావు ప్రకటించారు.
రాష్ట్ర విభజన వేళ 7 మండలాలను ఏపీలో కలిపారు. రాష్ట్రానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతోంది. విలీనంపై బంద్‌కు పిలుపునిచ్చి తీవ్ర నిరసన తెలిపాం. తొలినాళ్లలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగితే నిరసన తెలిపాం. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగితే ధర్నా చేపట్టాం. ఇవాళ కూడా రాష్ట్రంలో ఉండే లక్షల మంది రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ.. కేంద్రంపై ఒత్తిడి తెవాలనే ఉద్దేశంతో మహాధర్నాకు పిలుపునిచ్చాం. మేము ఏమి చేసిన రాష్ట్రంలోని ప్రజలకోసమే. పంబాజ్‌లో ప్రతి గింజా కొంటున్నప్పుడు తెలంగాణంలో ఎందుకు కొనరో చెప్పండి. రాష్ట్రానికో విధానం ఉండొద్దు కదా.. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన తెరాస పార్టీ శ్రేణులందరూ ధర్నాలో పాల్గొంటారు. - హరీశ్‌రావు, రాష్ట్ర మంత్రి
ధర్నాకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్
రాష్ట్ర రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. కేంద్రం.. రాష్ట్రానికి, ప్రాంతానికి ఒక నీతి పాటిస్తోందని ఆరోపించారు. పంజాబ్‌లో వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తున్నారని... తెలంగాణ ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తోందని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి సమాధానం లేదని అన్నారు. తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం... మంగళవారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఈనెల 18న ఇందిరాపార్క్‌లో తెరాస మహాధర్నా చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారని స్పష్టం చేశారు. మహాధర్నా తర్వాత గవర్నర్‌కు వినతిపత్రం అందిస్తామని అన్నారు. ఈనెల 18 తర్వాత రెండ్రోజుల్లో కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.. పార్లమెంటులోనూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: Srinivas goud news: 'రాష్ట్ర పర్యాటక ప్రదేశాలపై వారానికొక వీడియో విడుదల చేస్తాం'