ETV Bharat / state

రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు 4 విభాగాలుగా వర్గీకరణ - మంత్రివర్గ ఉపసంఘం వార్తలు

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతంగా ముందుకుతీసుకెళ్లేందుకు పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను వారంలోపే అధిగమిస్తామని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. త్వరలో అన్నివర్గాలతో సమావేశమై వారి నుంచి వచ్చే అభిప్రాయాలు, సలహాలను స్వీకరించి మరింత మెరుగ్గా వ్యవస్థను తీర్చిదిద్దుతామని మంత్రులు తెలిపారు.

ministers subcommittee  met on non agriculture lands registrations
రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను 4 విభాగాలుగా వర్గీకరణ
author img

By

Published : Dec 15, 2020, 7:05 PM IST

రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను 4 విభాగాలుగా వర్గీకరణ

వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ అంశాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సబ్‌కమిటీ సమావేశంలో మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సీఎస్​ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల అభిప్రాయాలు మంత్రులు సేకరించారు.

అదనపు సిబ్బంది సర్దుబాటు

రిజిస్ట్రేషన్ల సమయంలో ఎదురవుతున్న సమస్యలను బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంఘాలు వివరించాయి. వారు చెప్పిన విషయాలను మంత్రివర్గ ఉపసంఘం సావధానంగా ఆలకించింది. సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రద్దీ ఆధారంగా రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను 4 విభాగాలుగా వర్గీకరించామని... ఎక్కువ పని ఒత్తిడి ఉండేచోట అదనపు సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రకటించారు.

పెండింగ్ రిజిస్ట్రేషన్లు లేకుండా చర్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు సహా వివిధ వర్గాలతో సమావేశమవుతామని మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. రిజిస్ట్రేషన్ల అంశానికి సంబంధించి వారి అభిప్రాయాలు, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకోవటంతో పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మార్చి వరకు ఎలాంటి పెండింగ్ రిజిస్ట్రేషన్లు లేకుండా చర్యలు తీసుకునేలా యంత్రాంగానికి ఉపసంఘం నిర్దేశించింది. వారంలోపే రిజిస్ట్రేషన్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తామని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: కుటుంబీకుల జాడ కోసం పాకిస్థాన్​ నుంచి బాసరకు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.