గ్రామాల్లో, నగరాల్లో విజృంభిస్తోన్న విష జ్వరాలను అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. గ్రామల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం చేపట్టాల్సిన చర్యలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. సర్పంచ్, కార్యదర్శి ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు పూర్తిచేయాలని మంత్రులు స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల తీవ్రతను పారిశుద్ధ్య నిర్వహణతో ఎదుర్కొనే అంశంపై జిల్లా, మండల, గ్రామస్థాయిలో అనుసరించే కార్యాచరణపై సమావేశంలో చర్చించామని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా అన్ని రకాల పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో శుభ్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని...ఒక్కో గ్రామానికి సగటున ఏటా రూ.8 లక్షల చొప్పున నిధులను మంజూరు చేస్తుందన్నారు.
'యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలి' - 'గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖ కసరత్తు'
గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య నిర్వహణ పనులు పూర్తి చెయ్యాలని మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు.