ETV Bharat / state

'మేడారం జాతరకు శాశ్వత ఏర్పాట్లు'

​​​​​​​ భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికంగా భక్తులు తరలివచ్చే మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై మంత్రులు దయాకర్​ రావు, కొప్పుల, ఇంద్రకరణ్​ రెడ్డి సమీక్షించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. శాశ్వత ఏర్పాట్ల కోసం పది కోట్లతో భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించించారు. జాతర నిర్వహణపై పూజారులు, గిరిజన సంఘాలతో సంప్రదింపులు చేసే బాధ్యతను ములుగు కలెక్టర్, ఐటీడీఏ పీఓకు అప్పగించారు.

మేడరం జాతర
author img

By

Published : Aug 8, 2019, 11:12 PM IST

Updated : Aug 8, 2019, 11:18 PM IST

'మేడారం జాతరకు శాశ్వత ఏర్పాట్లు'

ప్రతిష్ఠాత్మక మేడారం జాతరను ఘనంగా నిర్వహించేలా శాశ్వత ప్రాదిపదికన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. గద్దెల పరిసరాల్లో భక్తుల వసతులు, ఆర్టీసీ సేవలు, పోలీసు సిబ్బందికి అవసరమైన శాశ్వత నిర్మాణాల కోసం తొలిదశలో పదికోట్లతో భూసేకరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. జాతరకు కోటి 40 లక్షలకుపైగా మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు, ముఖ్యంగా పోలీసు శాఖతో సమన్వయంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు.

సమగ్ర నివేదిక

జాతరలో కీలకమైన పారిశుద్ధ్యం, తాగునీటి కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని... మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేలా ఉండాలని ఆదేశించారు. జాతరకు కావాల్సిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను తయారు చేయాలని... వచ్చే నెలలో మరోమారు సమావేశమై ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్​కు సమర్పించాలని తెలిపారు. మేడారం పూజారులు, ఆదివాసీల మనోభావాలు, సంప్రదాయాల ప్రకారం జాతరను నిర్వహించాలని స్పష్టం చేశారు. వారితో సంప్రదింపులు జరిపే బాధ్యతను ములుగు కలెక్టర్, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓలకు మంత్రులు అప్పగించారు.

నగరాల్లో డిజిటల్‌ స్క్రీన్లు

జాతర గొప్పదనాన్ని అందరికీ తెలిపేలా హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి, అన్ని రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల మంత్రులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ గిరిజన సంఘాల ప్రతినిధులను అహ్వానించనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి!

File : TG_Hyd_39_08_Sammakka_Saaralamma_Pkg_3053262 From : Raghu Vardhan Note : Feed from Secretariat OFC ( ) ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా మేడారం జాతరను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మేడారం జాతరకు దాదాపు కోటిన్నర వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసిన రాష్ట్రప్రభుత్వం... శాశ్వత ఏర్పాట్ల కోసం పది కోట్లతో భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించింది. జాతర నిర్వహణపై పూజారులు, గిరిజన సంఘాలతో సంప్రదింపులు చేసే బాధ్యతలను ములుగు కలెక్టర్, ఐటీడీఏ పీఓకు అప్పగించారు...లుక్ వాయిస్ ఓవర్ - మేడారం సమ్మక్క - సారాలమ్మ జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. 2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనున్న మేడారం జాతరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు తెలిపారు. ప్రతిష్టాత్మక మేడారం జాతరను ఘనంగా నిర్వహించేలా శాశ్వత ప్రాదిపదికన ఏర్పాట్లు ఉండాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే ప్రత్యేకత ఉన్న పూర్తి గిరిజన జాతరకు మన రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్‌ నుంచి భక్తులు వస్తారని... ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కూడాఇష్టమైన జాతర అని చెప్పారు. భక్తులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా జాతరకు ఏర్పాట్లు చేయాలన్న మంత్రులు... ప్రతిసారి కొత్తగా పనులు చేపట్టకుండా శాశ్వత నిర్మాణాలు ఉండాలని గత జాతరకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ఆదేశించారని మంత్రులు గుర్తుచేశారు. మేడారం గద్దెలు, జాతర పరిసరాల్లో శాశ్వత నిర్మాణాల కోసం అవసరమైన భూములను సేకరించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా దశల వారీగా శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న మంత్రులు... గద్దెల పరిసరాలలో భక్తుల వసతులకు, ఆర్టీసీ సేవలకు, పోలీసు సిబ్బందికి అవసరమైన శాశ్వత నిర్మాణాల కోసం తొలిదశలో పదికోట్లతో భూసేకరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. జాతరకు కోటీ 40 లక్షలకు పైగా మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు, ముఖ్యంగా పోలీసు శాఖతో సమన్వయంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. గద్దెల పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని... క్యూలైన్ల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని తెలిపారు. జాతరలో కీలకమైన పారిశుద్ధ్యం, తాగునీటి కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరగాలని... మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు. జాతరకు కావాల్సిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను తయారు చేయాలని... వచ్చే నెలలో మరోమారు సమావేశమై ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు సమర్పించాలని తెలిపారు. వనజాతర సందర్భంగా అటవీ సంపదకు నష్టం జరగకుండా చూడాలని, కాలుష్య నియంత్రణపై సీరియస్‌గా ఉండాలన్న మంత్రులు... ప్లాస్టిక్‌ రహిత జాతర కోసం ప్రజలకు, భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. పూర్తిగా గిరిజన ఉత్సవాన్ని మేడారం పూజారులు, ఆదివాసీల మనోభావాలు, సంప్రదాయాల ప్రకారం జాతరను నిర్వహించాలని స్పష్టం చేశారు. జాతర ఏర్పాట్లలో వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉండాలని... వారితో సంప్రదింపులు జరిపే బాధ్యతను ములుగు కలెక్టర్, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓలకు మంత్రులు అప్పగించారు. మేడారం జాతర కమిటీని వెంటనే ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. మేడారం జాతరకు అనుబంధంగా జరిగే జాతరల నిర్వహణకు ప్రభుత్వ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎండ్‌ వాయిస్ : జాతర గొప్పదనాన్ని అందరికీ తెలిపేలా హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో మరోమారు సమీక్ష ఉంటుందని... అలోగా పూర్తి స్థాయి ప్రణాళిక వెంటనే సిద్ధం చేయాలని అధికారులను స్పష్టం చేశారు. మేడారం జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రితోపాటు అన్ని రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల మంత్రులను ఆహ్వానించనున్నట్లు మంత్రులు చెప్పారు. మనదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ గిరిజన సంఘాల ప్రతినిధులను అహ్వానించనున్నట్లు తెలిపారు.
Last Updated : Aug 8, 2019, 11:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.