హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా మంత్రులు ఈటల రాజేందర్, పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు.
పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి...
నేటి యువత వెస్ట్రన్ మోజులో పడి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను వదిలేస్తున్నారని ఈటల అన్నారు. టెక్నాలజీ, ఆర్థికంగా అమెరికా అగ్రదేశం అయినప్పటికీ అక్కడి ప్రజల్లో అంతరాయం ఏర్పడి గన్, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. ఖరీదైన వైద్య చికిత్సలు అన్ని వర్గాలకి అందుబాటులోకి తీసుకరావాలన్న సంకల్పంతో ముఖ్యమంతి పనిచేస్తున్నారని తెలిపారు.
వైద్యులు దేవుళ్లతో సమానం..
వైద్యులు దేవుళ్లతో సమానమని.. వైద్య వృత్తి సులభం కాదని మంత్రి అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. వైద్యులు మెదడు, మనస్సు రెండు ఎప్పుడూ ఏకాగ్రతగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ డైరెక్టర్ రాజయోగిని, బీకే కుల్దీప్ దిది, పలువురు వైద్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మల్లన్న స్వామికి బోనమెత్తిన మహిళలు