Ministers One Crore Plants Planted In Haritha Haram : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి వృక్షార్చన హరితహారం(Haritha Haram) కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లెలు, పట్టణాల్లో కోటి మొక్కలు(One Crore Plants) నాటేందుకు నడుంబిగించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్(CHILUKURU Fotest Block)లో.. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల వద్ద అటవీ అభివృద్ధి సంస్థ తీర్చిదిద్దిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం ట్రెక్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి మొక్కలు నాటారు.
Haritha Haram Scheme In Telangana : ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు.. కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటాలని మంత్రులు కోరారు. 360 ఎకరాల విస్తీర్ణంలో అటవీ అభివృద్ధి సంస్థ తీర్చిదిద్దిన ఫారెస్ట్ ట్రెక్ పార్కును మంత్రులు సందర్శించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మ్యాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ అదనపు ఆకర్షణగా నిలువనుంది.
Indian Forest Survey Report 2023 : హరితహారం ద్వారా తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కల పెంపకం
"ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇంతమంచి పార్కు రావడం వల్ల ల్యాండ్ ప్రోటెస్ట్తో పాటు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజూ వాకింగ్ చేయవచ్చు. ప్రతిరోజు 3000 మంది ఇక్కడ వాకింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సెలవు రోజుల్లో అయితే 5వేల మంది ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టూ 60 నుంచి 70 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. 119 పార్కులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కు ఫారెస్టు డిపార్టుమెంటు అందుబాటులోకి తేవడం జరుగుతుంది." -ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి
KTR Tweet On Haritha Haram : 'హరితహారం.. పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణం'
Haritha Haram 2023 In Telangana : హరితహారంలో భాగంగా కోటి మొక్కలను నాటాలని సంకల్పించుకున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పండగలా జరిగిందని అన్నారు. ఇప్పటికీ 230 లక్షల కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించుకుంటే 270 లక్షల కోట్ల మొక్కలు నాటామని హర్షించారు.
Telangana Haritha Haram 2023 : ఇప్పటివరకు నాటిన మొక్కల్లో 80 శాతం బతికాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 30 కోట్ల మొక్కలు నాటే ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. పార్కులో గజీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్ వంటి తదితర సదుపాయాలు ఉన్నాయి. మంత్రులు ఫారెస్ట్ ట్రెక్ పార్కునంతా ప్రత్యేక వాహనంలో కలియతిరిగారు.
Harish Rao on Haritha Haram : 'దేశంలోనే 7.4 శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక రాష్ట్రం.. మన తెలంగాణ'
నేడు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక హరితహారం, పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, అధికారులు