Ministers On Dalita Bandu: దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని... మార్చి నెలాఖరుకల్లా గ్రౌండింగ్ చేయాలని మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖల అధికారులతో హైదరాబాద్ అరణ్యభవన్‌లో సమావేశమైన ఇరువురు మంత్రులు... సంబంధిత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మంత్రులు అన్నారు. అధికారులందరూ పూర్తి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దళితబంధు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేసి మార్చి నెలాఖరు వరకు గ్రౌండింగ్ పూర్తి చేయాలని హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఆయా శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పనులను వేగంగా పూర్తి చేయాలన్న మంత్రులు... అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి : 'అనుమతి వేగంగా వస్తే.. కొవాగ్జిన్ తొందరగానే అందుబాటులోకి వచ్చేది'