అన్ని వర్గాలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ధేందుకే సీఎం కేసీఆర్ మరిన్ని గురుకుల పాఠశాలలు నెలకొల్పారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గతంలో గురుకులాలు పేరుకు మాత్రమే ఉంటే... ఇప్పుడు పాఠశాలలతోపాటు మౌలిక సదుపాయాలు, నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నాయన్నారు.
సంక్షేమ భవన్‌లో మంత్రి అధ్యక్షతన రెండు గంటల పాటు సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గురుకులాల బలోపేతం, విద్యార్థులను మరింత తీర్చిదిద్ధేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూలంకశంగా చర్చించారు. బాలికలకు మాదిరిగానే బాలురకు డిగ్రీ కళాశాలలను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తోన్న రూ. 20 లక్షల పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను మంత్రి సత్కరించారు.
ఇదీ చూడండి : రైతుల పంట నష్టంపై పట్టింపు లేదు: జీవన్ రెడ్డి