మిషన్ భగీరథ అమలులో పొరపాట్లు ఉంటే సూచనలు చేయాలి కానీ... దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న పథకాన్ని విమర్శంచడం తగదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏప్రిల్ వరకు గడువు పెట్టుకున్నామని అప్పటి వరకు పనులు అన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కంపెనీల నీటి కంటే మిషన్ భగీరథ నీరు చాలా మంచివని పేర్కొన్నారు.
ఆ శాఖకు మంత్రిగా ఉండడం అదృష్టం
గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు స్వచ్ఛతతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉండడం తన అదృష్టమని ఎర్రబెల్లి ఆనందం వ్యక్తం చేశారు. గాంధీజీ కలలను కేసీఆర్ తెలంగాణలో నెరవేరుస్తున్నారని ప్రశంసించారు.
ఇదీ చూడండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...